తానా త్రోబాల్‌ పోటీల్లో సత్తా చాటిన మహిళలు

Featured Image

పెన్సిల్వేనియాలోని ఓక్స్‌ నగరంలో తానా మిడ్‌-అట్లాంటిక్‌ విభాగం ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. డ్రాగన్స్‌, ఈగిల్స్‌, థండర్‌ త్రోస్‌, పవర్‌ ఉమెన్‌, డిటౌన్‌ డాజ్లర్స్‌, స్ట్రైకర్స్‌, మావెరిక్స్‌, ఎక్స్టన్‌ ఆక్వాడ్‌, పవర్‌ గర్ల్స్‌ జట్లకు చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పవర్‌ ఉమెన్‌ టీమ్‌ విజేతలుగా నిలిచారు. ఈ జట్టులో కల్పన డొప్పలపూడి, దియా భార్గవ్‌, శ్రుతి అనంతరామన్‌, లీలా దొంతుకర్తి, చైతన్య నాగరాజు, సుధా వర్కూర్‌, దీప్తి పోల, లక్ష్మీ పూజా చిట్టూరి, సుదర్శిని సంగలపోర్‌ వేణుగోపాల్‌ తమ సత్తా చాటారు. డ్రాగన్స్‌ టీమ్‌ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. అను సౌందరరాజన్‌, నందిని జనార్థనన్‌, శేత్ర శాంతనం, మధు మగేష్‌, దివ్యతేజస్విని తిరుమలశెట్టి, రీష్మా దొమ్మరాజు, ప్రియా మోహన్‌, వైదేహి నాగిళ్ళ, అమృత సెంథిల్‌ కుమార్‌, గాయత్రి సబరీష్‌ ప్రతిభ కనబరిచారు.

రంజిత్‌ మామిడి, చలం పావులూరిలు సమన్వయపరిచారు. దీప్తి కోక, చైతన్య కట్టా రిఫరీలుగా వ్యవహరించారు. వాలంటీర్లు ధీరజ్‌ యలమంచి, శ్రుతి కోగంటి, ప్రణవ్‌ కంతేటి, నిహారిక కస్తూరి, యశస్వి ఆలలు ఏర్పాట్లకు సహకరించారు. గ్రాండ్‌ స్పాన్సర్‌గా వేణు సంగాని మద్దతునిచ్చారు. మిడ్‌-అట్లాంటిక్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ ఫణి కంతేటి, నరేన్‌ కొడాలి, రవి పొట్లూరి, వెంకట్‌ సింగు, సాయి బొల్లినేని, సతీష్‌ తుమ్మల, సతీష్‌ చుండ్రు, సునీల్‌ కోగంటి తదితరులు పాల్గొన్నారు.

Tags-TANA Mid Atlantic Womens Throwball Competitions 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles