నాట్స్ షార్లెట్ విభాగం ప్రారంభం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అమెరికాలో తన విభాగాల విస్తరణలో భాగంగా ఉత్తర కరోలీనాలోని షార్లెట్‌లో నూతన విభాగాన్ని ప్రారంభించింది. తెలుగువారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. షార్లెట్‌లో తెలుగు వారి కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి నాట్స్ ప్రతిష్ఠను మరింత పెంచాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి కోరారు. ముఖ్యఅతిధిగా రమణమూర్తి గులివందల హాజరయ్యారు. నాట్స్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు దగ్గుబాటి, రాలీ నుంచి ఉమా నార్నె, భాను నిజాంపట్నం, కల్పనా అధికారి తదితరులు పాల్గొన్నారు. విభాగ ప్రారంభం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.

షార్లెట్ నాట్స్ ప్రతినిధులు

దీపిక సయ్యాపరాజు – చాప్టర్ కోఆర్డినేటర్

పల్లవి అప్పాణి – జాయింట్ కోఆర్డినేటర్

వినీలా దొప్పలపూడి – ఈవెంట్స్

ప్రవీణ పాకలపాటి – మహిళా సాధికారత

వెంకట్ యలమంచిలి – ట్రెజరర్

లక్ష్మీ బిజ్జల – జాయింట్ ట్రెజరర్

సిద్ధార్థ చగంటి – క్రీడలు

సుమ జుజ్జూరు – సోషల్ మీడియా

Tags-NATS Telugu Chapter Started In Charlotte North Carolina

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles