లండన్‌లో ఎన్నారై భారాస నిరసన

Featured Image

లండన్‌లో ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన కార్యక్రమం టావోస్టిక్ స్క్వేర్‌లోని గాంధీ విగ్రహం వద్ద జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలనలో ప్రజల్ని మోసం చేసిందని, ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాల్గొన్న వారు ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమానికి ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు హరి నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రేతినేని, గణేష్ కుప్పాల తదితరులు హాజరయ్యారు.

అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి దిశగా వెనుకబడిందని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడులు, ప్రగతి సాధించిందని కానీ ఇప్పుడు అప్పులు, అరాచక పాలన తప్ప ప్రజలకు ఉపయోగం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరియు హైదరాబాద్‌ బ్రాండ్‌ను కాంగ్రెస్ కుట్రల నుండి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నవీన్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకపోగా లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేసిందని విమర్శించారు. ప్రజల గొంతు వినిపించే సమయం వచ్చిందని, #RaiseYourVoice నినాదంతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రవాసుల మద్దతుతో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం కొనసాగిస్తామని తెలిపారు.

హరి నవాపేట్, సత్య మూర్తి, రవి రేతినేని, గణేష్ కుప్పాల తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతి, అక్రమ అరెస్టులు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై విమర్శలు చేశారు. కెసిఆర్, కేటీఆర్ నాయకత్వమే రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూకే విభాగం సభ్యులు మల్లా రెడ్డి, సురేష్ గోపతి, రవి ప్రదీప్ పులుసు, ప్రశాంత్ మామిడాల, అంజన్ రావు, తరుణ్ లునావత్ తదితరులు పాల్గొన్నారు.

Tags-NRI BRS Protest Against Congress In London

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles