న్యూజెర్సీ..ముగిసిన నాట్స్ వాలీబాల్ పోటీ

Featured Image

నాట్స్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఆదివారం నాడు వాలీబాల్ టోర్నమెంట్‌ నిర్వహించారు. రాబిన్స్‌విల్లే ఔట్‌డోర్ శాండ్ వాలీబాల్ కోర్టులలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. 14 వాలీబాల్ జట్లు పోటీ పడ్డాయి. అడ్వాన్స్‌డ్ లీగ్, మేజర్ లీగ్ విభాగాలుగా నిర్వహించారు. అడ్వాన్స్‌డ్ లీగ్‌లో పిందాల్లే జట్టు విజేతగా, రెబెల్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మేజర్ లీగ్‌లో అప్‌సెట్టర్స్ జట్టు విజేతగా, రైకర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేతలుగా నగదు బహుమతులు, ట్రోఫీలను నాట్స్ ప్రతినిధులు అందజేశారు.

నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి పోటీలను పర్యవేక్షించారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, రాబిన్స్ విల్లే టీం సభ్యులు రంగరాజు, సుకేష్ సబ్బాని, నీలం శ్రీనివాస్, సుబ్బరాజు, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ టీపీ రావు, నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి, నాట్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీకృష్ణ మేడిచెర్ల, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, శ్రీకాంత్ పొనకల, రమేష్ నెల్లూరి, సురేంద్ర పోలేపల్లి, కృష్ణ సాగర్ రాపర్ల, మౌర్య యలమంచిలి, కృష్ణ గోపాల్ నెక్కంటి, బ్రహ్మానందం పుసులూరి, శ్రీనాథ్, జతిన్ కొల్లా, చైతన్య మాదాల, ధర్మా, బినీత్ ఈ టోర్నమెంట్ నిర్వహణకు కృషి చేశారు. విజేతలకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందనలు తెలిపారు.

Tags-NATS New Jersey Volleyball Competitions 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles