న్యూజెర్సీలో దాశరథి శతజయంతి ఉత్సవం

Featured Image

అమెరికా తెలుగు సంఘం(ATA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో దాశరథి శత జయంతి ఉతవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆటా సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు ఏశారు. ఆటా సాహిత్య విభాగం చైర్ వేణు నక్షత్రం, కో-చైర్ రాజ్ శీలం సమన్వయపరిచారు.

ప్రముఖ తెలుగు కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతిని పురస్కరించుకుని అవధాని నరాల రామారెడ్డి, సుభద్ర వేదుల, తమ్మినేని యదుకుల భూషణ్‌లు పాల్గొని దాశరథి సాహిత్య మహత్తు, కవిత్వ వైభవం, ఆవేశభరితమైన ఉద్యమ కవిత్వం గురించి విశ్లేషించారు. నరాల రామారెడ్డి దాశరథితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా ఆటా నిర్వహిస్తున్న సాంస్కృతిక, సామాజిక సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు శ్రీనివాస్ దార్గుల, సంతోష్ రెడ్డి కోరం, రీజనల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మెంబర్షిప్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ తుమ్మల, రీజనల్ కన్వీనర్ కృష్ణమోహన్, ఆకుల ప్రసాద్ తదితర ఆటా కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.

Tags-Dasarathi Centennial Birthday in New Jersey

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles