కాలిఫోర్నియాలో మినీమహానాడు. ఘనంగా ఎన్‌టీఆర్ జయంతి.

Featured Image

అమెరికాలోని బేఏరియాలో నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సంబరాలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, మహిళలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆడియో కాల్ ద్వారా మాట్లాడుతూ.. తెలుగు నేల కోసం, తెలుగు వారి కోసం ప‌రిత‌పించిన నంద‌మూరి తార‌క‌రామారావు చిరస్మరణీయుడు అని పేర్కొన్నారు. ఆయన 102వ జయంతి మాత్రమే కాకుండా సినీరంగ ప్రవేశం జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకులు, సినీ నటులు కాశీవిశ్వనాధ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వేడుకలలో పాలుపంచుకునే అవకాశం దొరకడం తన అదృష్టం అన్నారు.

కోగంటి వెంకట్, శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, గాంధి పాపినేని, లియోన్ బోయపాటి, విజయ్ సాగర్ రెడ్డి సమన్వయపరచగా, భరత్ ముప్పిరాల, సీతారాం కొడాలి, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, బ్రహ్మానంద నాయుడు దబ్బర, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, రవికిరణ్ ఆలేటి, కోన నరేంద్రనాధ్ రెడ్డి, తిరుపతిరావు, శ్రీనివాస్ ఆత్మకూరి, హరి సన్నిధి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రాఘవయ్య, రాజా కొల్లి, హర్ష యడ్లపాటి, అనిల్ సాపినేని, చంద్రశేఖర్, రాంబాబు మానుకొండ, మోహన్, లోకేష్, యెంవీ రావు, గాంధి ప్రసాద్, సుబ్బారావు, కృష్ణ నరుకుళ్ళ, మునిరెడ్డి, నవీన్ కొడాలి, చేతన జాగర్లముడి, సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, రూప గుర్రం, విలేఖ్య వెనిగళ్ళ, రుద్రాణి తాతినేని, మాధురి వెన్నపూస, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి దబ్బర, శిరియాలు నెల్లూరి తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Bay Area California NRI TDP Celebrates Mahanadu

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles