లండన్‌లో ఉత్సాహంగా టాక్ బతుకమ్మ సంబురాలు

Featured Image

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. యుకే నలుమూలల నుండి వచ్చిన రెండు వేలకుపైగా ప్రవాస భారతీయ కుటుంబాలు ఈ సంబరాలకు హాజరయ్యాయి. ప్రవాసులు అందరూ చేనేత బట్టలు ధరించి పాల్గొనడం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మలు పెట్టి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించారు. చిన్నారులు కూడా చిన్న బతుకమ్మలతో పాల్గొని సందడి చేశారు.

ఈ వేడుకలకు హౌంస్లౌ మేయర్ అమీ క్రాఫ్ట్ ముఖ్య అతిథిగా హాజరై, యుకేలోని తెలంగాణ ఎన్నారైల సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఎఫ్డీసి మాజీ చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం కూడా పాల్గొని టాక్ ప్రతినిధుల కృషిని ప్రశంసించారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం చేనేతకు చేయూతనిస్తూ బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, ఉపాధ్యక్షుడు రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగళి, శ్రీకాంత్ జెల్ల, కన్వీనర్ అశోక్ దూసరి, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, అడ్వైసరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ఈవెంట్స్ ఇంచార్జి మల్లా రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు.

వేడుకలో భాగంగా దసరా అలాయ్ - బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఆకులు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంలో చేనేతకు చేయూతగా ఎల్లప్పుడూ చేనేత వస్త్రాలు ధరించాలనే ప్రతిజ్ఞ చేశారు. లండన్ పట్టణంలో అలాయ్ - బలాయ్ వాతావరణం స్థానికంగా నివసించే వివిధ జాతుల వారికి కూడా ప్రత్యేక అనుభూతిని కలిగించింది. మహిళలు గౌరీ పూజలు నిర్వహించి రంగురంగుల బతుకమ్మలతో ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో నాగరాజు తౌటం టాక్ తరపున ప్రత్యేక సన్మానం పొందారు. రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగళి మాట్లాడుతూ, గతంలో కూడా నాగరాజు టాక్ కార్యక్రమాలకు అనేక సహాయ సహకారాలు అందించారని, భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు. అలాగే రవి రేతినేని, హరి గౌడ్, గణేష్ కుప్పాల తమ కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర కంది, స్వాతి బుడగం, సత్యమూర్తి చిలుమల, వెంకట్ రెడ్డి దొంతుల, సత్యం కంది, రవి ప్రదీప్, క్రాంతి రేటినేని, జాహ్నవి, శశి, తేజ, నిఖిల్, ప్రవీణ్ వీర, మాధవ రెడ్డి, రంజిత్, కార్తీక్, శ్రీధర్ రావు, స్నేహ, శైలజ, శ్రీ విద్య, అంజన్ రావు, మహేందర్, శ్వేతా మహేందర్, మౌనిక, రాజేష్ వాక, యువజన విభాగం నాయకుడు తరుణ్ తదితరులు పాల్గొని వేడుకకు కొత్త అందం తీసుకువచ్చారు.

వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టాక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బిజీ జీవితంలోనూ ప్రవాసులు ఇలాగే స్వదేశ సంస్కృతిని కాపాడుతూ, సమాజానికి సేవ చేస్తుండటం గర్వకారణమని హాజరైన అతిథులు అభినందించారు. ఉత్తమ బతుకమ్మలకు గోల్డ్ కాయిన్స్ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు చేనేత బతుకమ్మ - దసరా సంబరాలను విజయవంతం చేశారు.

Tags-TAUK London Batukamma Dasara 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles