వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు

Featured Image

తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రం వెస్ట్ చెస్టర్లో గత శనివారం జరిగిన సంబరాల్లో పెద్దసంఖ్యలో ప్రవాసులు పాల్గొన్నారు.

పిల్లలకు భోగిపళ్లు పోశారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్వేత కొమ్మోజి, మనీషా మేకలు వ్యాఖ్యాతలుగా వేడుకలను రక్తికట్టించారు. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని ఇటీవల నిర్వహించిన ఆహార సేకరణలో పాల్గొన్న వలంటీర్లను సత్కరించారు.

తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల, సమన్వయకర్తలు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరి, శ్రీధర్ అంచూరి, సురేష్ బందుగుల, తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ సరోజ పావులూరి, దీప్తి కోక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల తదితరులు వేడుకల విజయవంతానికి సహకరించారు. తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

Tags-TANA Mid-Atlantic Celebrates 2026 Telugu Sankranti

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles