డల్లాస్‌లో భారాస సందడి

Featured Image

జూన్ 1వ తేదీన డల్లాస్‌లో భారత రాష్ట్ర సమితి (భారాస) 25వ వార్షికోత్సవంతో (రజతోత్సవం) పాటు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల నిర్వహణ సన్నాహక సదస్సును మంగళవారం నాడు డల్లాస్ పరిసర ప్రాంతమైన లూయిస్‌విల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో భారాస గ్లోబల్ కన్వీనర్ మహేష్ బిగాల, అమెరికా ఎన్నారై భారాస కన్వీనర్ మహేష్ తన్నీరు మాట్లాడారు.

అమెరికాలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం జరపాలనే ఆలోచన వచ్చినప్పుడు డల్లాస్ నగరాన్ని సూచించింది కేసీఆర్ అని మహేష్ బిగాల వెల్లడించారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌ను డల్లాస్ మాదిరి తీర్చిదిద్దుతానని చెప్పి ఆ హామీని నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ వేడుకల్లో డల్లాస్ నుండే గాక, అమెరికావ్యాప్తంగా ఉన్న ప్రవాసులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారని, దీన్ని విజయవంతం చేయవల్సిందిగా తన్నీరు మహేష్ కోరారు. అనంతరం రావు కల్వల, అనురాధ, రఘువీర్, మాధవి లోకిరెడ్డి, జానకీ తదితరులు ప్రసంగించి వేడుకలను విజయవంతం చేయవల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమానికి పూర్వం మంగళవారం ఉదయం వేడుకల నిర్వహణ కార్యవర్గం సభ జరగనున్న అలెన్‌లోని కొమెరికా సెంటరును సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీనివాస్ సురకుంటి, అభిలాష్ రంగినేని, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ముఠా జయసింహ, ఆశిష్ యాదవ్, శ్రీనివాస్ సురభి, హరికృష్ణ దొర్నాల, నరసింహ నాగులవంచలు, అరవింద్‌రావు తక్కెళ్లపల్లి, ఉపేందర్ గౌడ్, జాన్సన్ నాయక్, వంశీరెడ్డి కంచరకుంట్ల తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-BRS Planning Meetings In Lewisville DFW

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles