ఫీనిక్స్‌లో ఆటా దినోత్సవం

Featured Image

ఆరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో ఆటా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల బాల్టిమోర్ నగరంలో ఆటా 19వ మహాసభలు 2026 జులై 31-ఆగష్టు 2 మధ్య నిర్వహిస్తున్నామని, ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆటా వేడుకలు తెలుగు రాష్ట్రాలలో డిసెంబర్ 12–27 మధ్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రార్థనతో మొదలైన ఈ వేడుకలు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. సాసంకృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ప్రవాస తెలుగు యువతీయువకులు తమ ప్రతిభను ఆవిష్కరించారు. నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బిజినెస్ సెమినార్ చర్చలు ఫలప్రదంగా సాగాయి. ఫ్యాషన్ షో సాంప్రదాయ దుస్తులు,ఆధునిక శైలులను ఆవిష్కరించింది.

సుమంగళి బృందం నిర్వహించిన సంగీత కచేరీ అతిథులను ఉర్రూతలూగించింది. బోర్డ్ మెంబర్స్, కన్వీనర్సు, కల్చరల్ చైర్ పర్సన్స్, ఫీనిక్స్ ఆటా టీమ్, వాలంటీర్లు, ఆర్టిస్టులు, స్పాన్సర్స్, సెక్రటరీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సిరెడ్డి గడ్డికొప్పులా, ట్రస్టీ వెన్ రెడ్డి, ఆటా అరిజోన రీజినల్ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి గాడి, రీజినల్ కోఆర్డినేటర్స్ సునీల్ అన్నపురెడ్డి, శుభ గాయం, మదన్ బొల్లారెడ్డి తదితరులు వేడుక విజయవంతానికి కృషి చేశారు.

Tags-ATA Mini Convention Concludes Successfully in Arizona

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles