సింగపూర్‌లో బోనాల జాతర

Featured Image

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS)ఆధ్వర్యంలో ఆదివారం నాడు శ్రీ అరసకేసరి శివాలయంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. సంజయ్ తుమ్మ - వాహ్ చెఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి, అరవింద్‌లు పులివేషాల్లో అలరించారు.

రమేష్ గడప, వివేక్ బుర్గోజు, శశిధర్ రెడ్డి, నిఖిల్ ముక్కావర్, సందీప్ రెడ్డి పుట్టా, శ్వేత కుంభం, శ్రీనివాస్ గర్రెపల్లి, అలేఖ్య తడిసిన, అలేఖ్య దార, బండ శ్రీ దేవి, అనిత రెడ్డి చాడ, చీర్లవంచ రాజు, మనోహర్ సల్లా, మోతే శ్రీనివాస రెడ్డి, వేముల సురేష్, హర్షిణి కషాబోయినా, రాధాకృష్ణ ఎం.వి.ఎస్., విజయ్ అనూష, దీపా రెడ్డి మండలలు బోనం సమర్పించారు.

TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సొసైటీ ఉపాధ్యక్షుడు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాసరావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, సంతోష్ వర్మ మాదారపు, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకరరెడ్డి, చల్ల కృష్ణ తదితరులు సమన్వయపరిచారు. సంజయ్ తుమ్మను కార్యవర్గ సభ్యులు సత్కరించారు.

Tags-TCSS Singapore Bonalu Jatara 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles