పాతూరికి తానా పురస్కారం

Featured Image

భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగ మీడియా ఇన్‌ఛార్జి, గుంటూరు మాజీ జడ్పీ ఛైర్మన్ పాతూరి నాగభూషణంకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) అందించే విశిష్ట పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. జూలై 3వ తేదీన తానా 24వ మహాసభల్లో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయనున్నారు. వ్యవసాయ రంగంలో పాతూరి నాగభూషణం చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు తానా సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్ తెలిపారు. ఈ అవార్డును అందుకోవడానికి పాతూరి డెట్రాయిట్ చేరుకున్నారు. గురువారం నాడు తానా బ్యాంక్వెట్‌లో ఈ పురస్కారాన్ని అందుకుంటారు. తానాకు పాతూరి ధన్యవాదాలు తెలిపారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Paturi Nagabhushanam To Receive TANA Award

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles