బోస్టన్‌లో TAGB ధమాకా

Featured Image

బోస్టన్‌లో TAGB ఆధ్వర్యంలో దసరా, దీపావళి ధమాకా నిర్వహించారు. అక్టోబర్‌ 11న లిటిల్‌టన్‌ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ వేడుకలో పెద్దఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఛైర్‌ రవి అంకినీడు చౌదరి, టీఏజీబీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గొంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల పౌరాణిక పాత్రల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భావరాజు, మనీష ఎర్రబత్తిన, పృథ్వీ చంద్ర తమ పాటలతో ఉత్సాహ పరిచారు.

కార్యక్రమంలో భాగంగా బోస్టన్‌లో భారత కాన్సుల్‌ జనరల్‌ ఎస్.రఘురాం, రమేశ్‌ బాపనపల్లిలను సంస్థ సభ్యులు సన్మానించారు. పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎలక్ట్‌ సుధ ముల్పుర్‌, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కోశాధికారి జగదీశ్‌ చిన్నం, కల్చరల్‌ సెక్రటరీ సూర్య తెలప్రోలు, సభ్యులు శేషగిరిరెడ్డి, పద్మావతి భిమ్మన, కాళిదాస్‌ సూరపనేని, ఎక్స్‌ అఫీషియో మెంబర్‌ దీప్తి గోరా తదితరులు పాల్గొన్నారు.

Tags-TAGB Boston Celebrates Dasara Diwali 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles