ఖతర్‌ ఆంధ్ర కళా వేదిక ఎన్నికల్లో గొట్టిపాటి ప్యానెల్ ఘనవిజయం

Featured Image

ఖతర్‌లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘానికి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ అనూహ్యంగా అఖండ విజయం సాధించారు. అంతేకాకుండా తమ గెలుపు నల్లేరుమీద నడకే అన్న విశ్వాసంతో ఉన్న ప్రత్యర్ధి శిబిరం నుండి పోటీ చేసిన వారిలో ఏ ఒక్కరూ గెలుపు అంచుకు కూడా రాలేదు. బుధవారం రాత్రి ప్రకటించిన ఎన్నికల ఫలితాలలో రమణతో సహా ప్యానల్ నుండి పోటీ చేసిన పదకొండు మంది విజయదుందుభీ మోగించారు. మొత్తం పోల్ అయిన ఓట్లలో 73 శాతం రమణ ప్యానల్ దక్కించుకుంది.

రమణకు అత్యధికంగా అ తర్వాత వరుస క్రమంలో జి. కెన్నయ్య దొర, శాంతయ్య ఎలమంచిలి, సౌమ్య కానేటి, లోవశెట్టి వీరబాబు, యస్.వి.యల్.యన్ మూర్తి, కన్నోజు నాగేశ్వరి, శీరిషా తాళ్ళూరి, అయ్యన్న నాయుడు, నరేశ్ నూనే, ధరిణిలు ఓట్లు పొందడంతో వీరందరినీ విజేతలుగా ప్రకటించారు. రమణ ప్యానెల్ పక్షాన ప్రవాసీ ప్రముఖులు సత్యనారాయణ మలిరెడ్డి (సత్య), ప్రసాద్ కోడూరి, రమేశ్ దాసరి, అంజనేయులు, బొద్దు రామరావులు, రజనీమూర్తిలు ప్రచారం నిర్వహించగా భాగవతుల వెంకప్ప పక్షాన విక్రం సుఖవాసీ, హరీష్ రెడ్డి, సాయి రమేశ్, గోవర్ధన్ లు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ ఎన్నికలలో అఖండ విజయం తన భాద్యతను మరింత పెంచిందని రమణ వ్యాఖ్యానించారు. ఎన్నికలయ్యే వరకు మాత్రమే వాళ్ళు.. వీళ్ళని.. ఫలితాల తర్వాత మాత్రం అందరం ‘మేం’ అని ఆయన చెప్పారు. ఖతర్ లోని తెలుగు వారందరు ఒకే టీం అని.. జట్లు వేర్వేరుగా ఉన్నా.. టీం ఒక్కటేనని రమణ అన్నారు. అందరి సహాకారంతో సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలను వినూత్నంగా చేపడుతూ ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు.

Tags-Gottipati Ramana Panel Wins Qatar Andhra Kalavedika 2025 Elections

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles