న్యూజెర్సీలో ఆటా దసరా సంబరాలు

Featured Image

ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, డెలావేర్, పెన్సిల్వేనియా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా దసరా సంబరాలను జరుపుకున్నారు.

దుర్గా పూజతో ప్రారంభమైన ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా సాగాయి. పూజ అనంతరం జమ్మి చెట్టు పూజ నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా ఎలెక్ట్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది ఆటా చేపట్టబోయే కార్యక్రమాల గురించి సభ్యులకు వివరించారు. భారత కాన్సులేట్ (న్యూయార్క్) నుండి మహేష్ యాదవ్ పాల్గొన్నారు. సాయిదత్త పీఠాధిపతి రఘుశర్మ దుర్గామాత పూజ, రజిత ఆకుల బొమ్మల కొలువును సమన్వయపరిచారు.

ఆటా ప్రాంతీయ కోఆర్డినేటర్లు కృష్ణ మోహన్ మూలే, ప్రసాద్ ఆకుల, ప్రదీప్ రెడ్డి కట్టా, సంతోష్ కోరం, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, విలాస్ రెడ్డి జంబులలు వేడుక ఏర్పాట్లను పర్యవేక్షించారు. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో జరిగే ఆటా సంబరాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. బలగం చిత్రానికి బెస్ట్ లిరిక్స్ అవార్డు అందుకున్న రచయిత కాసర్ల శ్యామ్, సింగర్స్ రేలారే గంగా, దండేపల్లి శ్రీను, వ్యాఖ్యాత ఝాన్సీ రెడ్డి అలరించారు. ఆటా మహిళా విభాగం రీజినల్ చైర్ గీతా రెడ్డి, లలితా మూలే రామలీల ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కచేరీలు, పాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను సమన్వయపరిచి ప్రేక్షకులను అలరించారు.

ఆటా మాజీ అధ్యక్షులు పరమేశ్ భీంరెడ్డి, పెర్కారి సుధాకర్, డా.రాజేందర్ జిన్నా, బోర్డు కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ దార్గుల, వినోద్ కోడురు, విజయ్ కుందూరు, సంతోష్ కోరం, రాజు కక్కర్ల, బాణాల శ్రీధర్, రఘువీర్ రెడ్డి మరిపెద్ది, శరత్ వేముల, శ్రీకాంత్ గుడిపాటి, రఘువీర్ రెడ్డి, పరుషురాం పిన్నపురెడ్డి, రవీందర్ గూడూర్, రాజ్ చిలుముల, హరీష్ బత్తిని, ప్రవీణ్ ఆలా, కిరణ్ ఆలా, రమేష్ మాగంటి, విజయ్ గంగుల, ప్రదీప్, రవి పెద్ది తదితరులు ఉత్సవం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.

Tags-ATA New Jersey Celebrates 2025 Dasara In Edison

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles