డల్లాస్‌ను ఉర్రూతలూగించిన TPAD దసరా-బతుకమ్మ సంబరం

Featured Image

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన ఆఫ్‌ డాలస్‌ (టీపాడ్‌) దసరా-బతుకమ్మ వేడుకలు డల్లాస్ ప్రవాసులను అలరించాయి. శనివారం నాడు అలెన్ ఈవెంట్ సెంటరులో నిర్వహించిన ఈ వేడుక తెలంగాణా సంస్కృతి-సాంప్రదాయలకు ప్రతీకగా నిలిచింది.

స్థానిక కళాకారులు ఉదయం కార్యక్రమాల్లో భాగంగా చేసిన ప్రదర్శనలు, సాయంత్రం బతుకమ్మ, దసరా సంప్రదాయ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు థమన్ తన సంగీతంతో అతిథులను మైమరిపించారు. ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్, హీరోయిన్లు శివాని, అనన్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 70 మంది సంప్రదాయ నృత్యకారులు ప్రదర్శించిన మహిషాసురమర్ధిని నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది.

శివాని, అనన్యలు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన అనంతరం శమీవృక్షానికి, అమ్మవారికి పూజలు నిర్వహించి దేవేరులను పల్లకిలో ఊరేగించారు. డాలస్‌లోనే తన మొదటి కాన్సర్ట్‌ జరిగిందని చెప్పిన థమన్..తిరిగి టీపాడ్‌ వేదికపై ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. వేడుకను ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడు రావు కల్వల, ట్రస్ట్ బోర్డ్‌ అధ్యక్షుడు పాండురంగారెడ్డి పాల్వాయి, అధ్యక్షురాలు అనూరాధ మేకల, కోఆర్డినేటర్‌ రమణ లష్కర్‌, ఫౌండేషన్ కమిటీ సభ్యులు అజయ్‌రెడ్డి, జానకీరాం మందాడి, రఘువీర్‌ బండారులు పర్యవేక్షించారు. వంద మంది వాలంటీర్లు శ్రమించారు.

Tags-TPAD Dallas Dasara Batukamma 2025 Mesmerizes Audience

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles