నెబ్రాస్కా తెలుగు సమితి అధ్యక్షుడిగా కొల్లి ప్రసాద్

Featured Image

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN) 2025-26 నూతన కార్యవర్గం ప్రకటించారు. 2025-26 అధ్యక్షుడిగా కొల్లి ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2025-26 నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమాన్ని ఓమాహా హిందూ టెంపుల్ కమ్యూనిటీ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. సమావేశాన్ని జనరల్ సెక్రటరీ తాతారావు ప్రారంభించి స్వాగతోపన్యాసం చేశారు.

సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు రాజా కోమటిరెడ్డి 2024-25లో నిర్వహించిన సేవా-సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. కోశాధికారి సాంబా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ-వ్యయ వివరాలు సమర్పించారు. సభ్యులు బైలాస్ సవరణలు, భవిష్యత్తు కమిటీల ఏర్పాటు, సమితి అభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు.

తదుపరి నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలు జరిగాయి. సుందర్ నూతన అధ్యక్షుడిగా కొల్లి ప్రసాద్‌ను ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యవర్గంలో నూతనంగా కొందరిని ఎన్నుకోగా, ప్రస్తుత సభ్యులను ఇతర స్థానాల్లోకి పదోన్నతి కల్పిణ్చారు.

TSN 2025–2026 నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా తాతారావు, కోశాధికారిగా అలగన్, సాంస్కృతిక కార్యదర్శిగా రమ్య రావిపాటి, కోశాధికారిగా దివులా సాంబా, సహాయ కోశాధికారిగా పంగా యుగంధర్, ఇతర కార్యవర్గ సభ్యులుగా పోతినేని అనిల్, అవినాష్, గొట్టిపాటి ధన, రాయపాటి రమేష్, ముప్పరాజు వీరేంద్ర, కమిరెడ్డి బాల, బోర్డు సభ్యులుగా లక్ష్మీ మాధురి, మురకొండ వేణుగోపాల్, అనూప్, నీలిమ, చైతన్య రావిపాటిలు ఎన్నికయ్యారు.

సమితి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేస్తామని సభ్యులు తెలిపారు. సత్యనారాయణ పావులూరి, మురళీధర్ చింతపల్లి, ఫణి అడ్డిదాం, సుందర్ చుక్కరా, సోము కొడాలి, మహేష్, శరత్ బొడేపూడి, మైనేని కామేశ్వరరావు, శ్రీనివాస్ రావుల, ప్రసాద్ కందిమళ్ల, ఆదిబాబు, వేణు పొతినేని, నవీన్ కంటం తదితరులు పాల్గొన్నారు.

Tags-Kolli Prasad Elected As Telugu Samithi of Nebraska President

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles