వాషింగ్టన్ డిసిలో TDF బతుకమ్మ వేడుకలు

Featured Image

వాషింగ్టన్ డిసి తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(TDF-DC) విభాగం ఆధ్వర్యంలో 20వ వార్షిక బతుకమ్మ–దసరా వేడుకలు జాన్ చాంపే హై స్కూల్‌లో వైభవంగా నిర్వహించారు. మంజుషా నాంపల్లి, రుద్ర భీమ్‌రెడ్డి సమన్వయపరిచారు. మాజీ అధ్యక్షురాలు కవిత చల్లా, సలహాదారులు వినయ సూరినేని, కల్పనా బోయినపల్లిలు పర్యవేక్షించారు. గాయని చిత్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జానపద గాయకుడు బిక్షు నాయిక్ తన సంగీతంతో ప్రేక్షకులను అలరించారు.

మీడియా చైర్ అవంతిక నక్షత్రం రూపొందించిన ప్రత్యేక బతుకమ్మ టీజర్ ఆకట్టుకుంది. రంగురంగుల బతుకమ్మలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ గీతాలు, దసరా ఉత్సవాలతో వేదిక కళకళలాడింది. అశ్విని చిట్టిమల్ల బృందం అలంకరణ, మంజుల మద్దికుంట, శ్రీలక్ష్మి పోలోజు సమన్వయంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

Tags-TDF Washington DC Batukamma Dasara Celebrations

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles