మలేషియాలో BAM దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు

Featured Image

భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా(BAM) ఆధ్వర్యంలో మలేషియాలోని భారతీయ సమాజాలు కలసి దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలను బ్రిక్ఫీల్డ్స్లో ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్, భారత హైకమిషనర్, మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ – ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి భారతీయుడు ఐక్యంగా జరుపుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవమని కొనియాడారు. సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రేక్షకులను అలరించాయి. BAM కమిటీ అధ్యక్షుడు సత్య, ఉపాధ్యక్షుడు ముత్తినేని భాను, ఇతర సభ్యులు రవితేజ శ్రీదృశ్యం, రుద్రాక్షల సునీల్ కుమార్, గజ్జడ శ్రీకాంత్, రుద్రాక్షల రవికిరణ్ కుమార్, గీత హజారే, సోప్పరి నవీన్, యెనుముల వెంకట సాయి, అపర్ణ ఉగంధర్, సైచరణి కొండ, రహిత, సోప్పరి రాజేష్, పలకలూరి నాగరాజులు వేడుకలను సమన్వయపరిచారు.

Tags-BAM Malaysia Celebrates Dasara Batukamma Diwali 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles