నాట్స్ ఆధ్వర్యంలో ఫ్రిస్కోలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఫ్రిస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సీతాకోకచిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించారు. 40మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇందులో పాల్గొన్నారు.

గత ఆరు నెలలుగా నాట్స్ డల్లాస్ విభాగం ఈ పార్కును దత్తత తీసుకుని, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తోంది. ఈ పార్కులో ఇప్పటివరకు 2000కు పైగా మొక్కలు నాటారు.

ఫ్రిస్కో పార్క్ విభాగం అధికారి క్రిస్టల్, ప్రకృతి పరిరక్షకులు రిక్, లారా, నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపు నూతి, ప్రతినిధులు రాజేంద్ర మాదాల, రవి తాండ్ర, కిశోర్ నారె, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి, శివ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రకృతి హిత కార్యక్రమల నిర్వహణను అభినందించారు.

Tags-NATS Dallas Chapter Adopt A Park In Frisco Monarch Park

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles