CAA ఆధ్వర్యంలో చికాగోలో వైభవంగా సీతారామ కళ్యాణం

🕑 Published: April 26, 2026 at 04:07 PM CST

చికాగో ఆంధ్ర సంఘం(CAA) దశమ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని అరోరా శ్రీ వెంకటేశ్వర(బాలాజీ) స్వామి దేవస్థానంలో 11వ తేదీన కన్నుల పండుగగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు హనుమంత ప్రసాదు పురోహితులుగా క్రతువును నిర్వహించారు. చికాగో ఆంధ్ర సంఘం అధ్యక్షురాలు తమిష్రా కొంచాడ - శ్రీనివాస్ సుబుద్ధి వధువు పక్షాన కన్యాదానం చేయగా, సంస్థ చైర్మన్ రాఘవ - శివబాల జాట్ల కుటుంబం వరుడు పక్షాన చేరి కళ్యాణ క్రతువుని నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం శ్రీ సీతారాములవారిని, ఆంజనేయుడు, లక్ష్మణుని సమేతంగా పల్లకిలో ఊరేగించారు. ఊరేగింపులో స్థానిక ప్రవాసాంధ్ర ఆడపడుచులు కోలాటం అలరించింది.

కృష్ణ జాస్తి కళ్యాణ వేదికను అందంగా అలంకరించారు. కళ్యాణ్, సురేష్ అయినాపూడి, ధర్మేంద్ర గాలి, మురళి రెడ్డివారిలు విందు భోజన ఏర్పాట్లను సమన్వయపరిచారు. ప్రదీప్ బచ్చు, చక్రి, నరేంద్ర నూకల, సలహాదారు శ్రీకృష్ణ మాతుకుమల్లి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ తాడేపల్లి, కార్యదర్శి ఒగ్గు నరసింహారెడ్డి, సుజాత అప్పలనేని, భాగ్యలక్ష్మి సంగెం, ప్రభాకర్ మల్లంపల్లి, సురేష్ మహలి, గౌరీ అద్దంకి, కిరణ్ వంకాయలపాటి, కార్యవర్గ సభ్యులు సునీత రాచపల్లి, సుగుణ శిరందాసు, శృతి కూచంపూడి, శ్రీస్మిత నండూరి, శైలజ సప్ప, రమ్య మైనేని, స్వర్ణ నీలపు, సాహితీ కొత్త, సుభాష్ చేపలమడుగు, రామారావు కొత్తమాసు, శ్రియ కొంచాడ, దివిజ చల్లా, జైఅనికేత్ మెడబోయిన, జిష్ణు వీరపనేని తదితరులు సహకరించారు. ఆషా అడిగా విద్యార్థి కోగుల శ్రీ సురేష్ కుమార్ నృత్యోపచారం నిర్వహించారు. CAA సంస్థ అధ్యక్షురాలు తమిష్రా కొంచాడ, కార్యదర్శి ఒగ్గు నరసింహరెడ్డిలు వందన సమర్పణ చేశారు.

📲 Join Our WhatsApp Channel
ఆటా 19వ మహాసభల నిధుల సేకరణకు డాలస్‌లో విశేష స్పందనATA 19th Convention Fundriser In New Jersey Rises 625K USDఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి-కోమటి జయరాంన్యూయార్క్‌లో పంచెకట్టు ఫ్యాషన్ షో అదరహో!వర్జీనియాలో మైనర్లపై లైంగిక వేధింపులు...తెలుగు వ్యక్తికి 20ఏళ్ల జైలుశిక్షజర్మనీలో చంద్రబాబు జన్మదినోత్సవం..పాల్గొన్న మంత్రి భరత్నేడు వర్జీనియాలో కోమటి జయరాం పర్యటనవిద్యార్థుల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న నాట్స్ సేవా కార్యక్రమాలుNCAIA Holi Celebrations in WashingtonATA Convention Meet and Greet Kickoff In Harrisburg PA25న నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదిహాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలుసెయింట్‌లూయిస్‌లో చంద్రబాబు జన్మదినోత్సవంనాట్స్ వెలెనెస్ వెబినార్‌లో ఘట్టమనేని మంజుల సూచనలుజర్మనీలో జై చంద్రబాబు..ఘనంగా జన్మదిన వేడుకలుఆస్ట్రేలియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుశంకర నేత్రాలయకు $555,000 డాలర్ల విరాళం అందజేసిన అరవింద్ కృష్ణస్వామిఫిలడెల్ఫియాలో TAGDV ఉగాది సాంస్కృతిక పోటీలుమహబూబాబాద్ జిల్లాలో చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు"ఆటా" సభల్లో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారికి శుభవార్త
No Previous Next Article