🕑 Published: April 27, 2026 at 12:49 PM CST
శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో ముఖాముఖీ కార్యక్రమం ఆదివారం నాడు సింగపూర్‌లో ఏర్పాటు చేశారు. సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ గత దశాబ్దంలో భారతదేశం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ — "ఫ్రాజైల్ ఫైవ్" ఆర్థిక వ్యవస్థ నుండి ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదిగిదని, దిగుమతులపై ఆధారపడే దేశం నుండి ఎగుమతుల్లో శక్తివంతమైన దేశంగా మారిందని వివరించారు. సంక్షోభాలను ఎదుర్కొనే స్థితి నుండి అవకాశాలను సృష్టించే స్థితికి దేశం చేరుకుందని వివరించారు. GDP వృద్ధి రేటు 4.4% నుండి 7–8%కు పెరిగినట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం 2% కంటే తక్కువకి తగ్గినట్లు పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాంబాబు పాతూరి, చామిరాజు రామాంజనేయులు, పారిశ్రామికవేత్త కుమార్ నిట్టల, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షుడు రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు గుత్తుల రవికుమార్, వేణు మల్లవరపు, సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి సమన్వయపరిచారు. దాములూరి భరత్, వెంకట్ భీమినేని, యోగి బూరుగపల్లి, రాధాకృష్ణ గణేశ్న, సురేంద్ర చేబ్రోలు సహకరించారు.



