ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి-కోమటి జయరాం

🕑 Published: April 25, 2026 at 11:20 AM CST

అమరావతికి చట్టబద్దత కల్పించిన తర్వాత ఎన్నారైలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నారని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. శుక్రవారం సాయంత్రం వర్జీనియాలో ఆయనను ప్రవాసాంధ్రులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యులు కావాలని కోరారు. విద్యా, వైద్య సేవలను పేద ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడాలని కోరారు. ప్రధాని మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. భాను మాగులూరి ఈ సభకు అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు జయరాం సేవలు మరుపురానివని కొనియాడారు. OFBJP-USA అధ్యక్షుడు అడపా ప్రసాద్ మాట్లాడుతూ అమెరికాలో భారతీయులు ఎక్కువసంఖ్యలో నివసిస్తున్నారని..వారి ప్రయోజనాలు కాపాడటానికి జయరాం ముందువరసలో నిలవాలన్నారు. తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, జనసేన పార్టీ ప్రతినిధులు విజయ్ గుడిసేవ, వేణు పులిగుజ్జు, సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని, ఆటా ప్రతినిధులు కవిత చల్లా, GWTCS అధ్యక్షుడు రవి అడుసుమిల్లి, సాయిసుధా పాలడుగు, సతీష్ చింత, సత్యనారాయణ మన్నె, త్రిలోక్ కంతేటి, కృష్ణప్రియ అడుసుమిల్లి, కంచర్ల కిషోర్, పద్మజ బేవర, నాగ్ నెల్లూరి తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
న్యూయార్క్‌లో పంచెకట్టు ఫ్యాషన్ షో అదరహో!వర్జీనియాలో మైనర్లపై లైంగిక వేధింపులు...తెలుగు వ్యక్తికి 20ఏళ్ల జైలుశిక్షజర్మనీలో చంద్రబాబు జన్మదినోత్సవం..పాల్గొన్న మంత్రి భరత్నేడు వర్జీనియాలో కోమటి జయరాం పర్యటనవిద్యార్థుల్లో సామాజిక స్పృహ కల్పిస్తున్న నాట్స్ సేవా కార్యక్రమాలుNCAIA Holi Celebrations in WashingtonATA Convention Meet and Greet Kickoff In Harrisburg PA25న నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదిహాంకాంగ్‌లో వైభవంగా ఉగాది వేడుకలుసెయింట్‌లూయిస్‌లో చంద్రబాబు జన్మదినోత్సవంనాట్స్ వెలెనెస్ వెబినార్‌లో ఘట్టమనేని మంజుల సూచనలుజర్మనీలో జై చంద్రబాబు..ఘనంగా జన్మదిన వేడుకలుఆస్ట్రేలియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుశంకర నేత్రాలయకు $555,000 డాలర్ల విరాళం అందజేసిన అరవింద్ కృష్ణస్వామిఫిలడెల్ఫియాలో TAGDV ఉగాది సాంస్కృతిక పోటీలుమహబూబాబాద్ జిల్లాలో చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు"ఆటా" సభల్లో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారికి శుభవార్తతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఈస్టర్ ఎగ్ హంట్ - TANA Mid Atlantic Conducts 2026 Easter Egg Huntన్యూయార్క్‌లో డా. నోరిని సత్కరించిన అమెరికన్ పంజాబీ సొసైటీడల్లాస్‌లో వైభవంగా టాంటెక్స్ ఉగాది మహోత్సవం
Previous Article Next Article