విజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్

🕑 Published: June 16, 2026 at 10:36 AM CST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్క్‌లో శనివారం నాడు మహిళల త్రోబాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించారు. 60మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీప్తి కోక, చైతన్య కట్టా రిఫరీలుగా వ్యవహరించారు.

పోటీలో విజేతగా అనురాధ సౌందరరాజన్, రూబి ఈశ్వరమూర్తి, శేత్ర సంతానం, మధు మాగేష్, నందిని జనార్థనన్, దివ్యతేజస్విని తిరుమలశెట్టి, రీష్మా దొమ్మరాజు, ధివ్య కరుప్పన్, శ్వేత శ్రీగణేష్‌లతో కూడిన డ్రాగన్స్ జట్టు విజేతగా నిలిచింది. సుధ, అభి, కల్పన, భాను, మాలతి, తంగం, హుస్సేని, రంజనిల అల్టిమేట్ వారియర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు.

తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు పోటీదారులకు అభినందనలు తెలిపారు. సునీల్ కోగంటి, ప్రసాద్ క్రొత్తపల్లి, శ్రీధర్ సాదినేని, విశ్వనాథ్ కోగంటి, సురేష్ యలమంచి, గౌరి కర్రోతు సహకరించారు. రంజిత్ మామిడి, చలం పావులూరిలు సమన్వయపరిచారు. కేతన్ మామిడి, కార్తికేయ రావత్‌లకు యూత్ వాలంటీర్ రాఫెల్ బహుమతి అందజేశారు.

📲 Join Our WhatsApp Channel
అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడుAPTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణఎన్నారైలకు తితిదే గుడ్ న్యూస్...ఇక 90రోజులుమలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధంస్కాట్‌ల్యాండ్‌లో ఘనంగా మినీ మహానాడు
No Previous Next Article