🕑 Published: June 18, 2026 at 08:39 AM CST
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) చికాగో విభాగం ఆధ్వర్యంలో "అడాప్ట్-ఎ-హైవే" సేవా కార్యక్రమం నిర్వహించారు. సామాజిక బాధ్యతగా హైవేలో కొంత భాగాన్ని దత్తత తీసుకుని దాని పరిశుభ్రత, పచ్చదనం కాపాడే బాధ్యతను నాట్స్ నిర్వహించింది. 20 మందికి పైగా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాట్స్ ద్వారా విద్యార్ధులు చేస్తున్న ఈ సేవల ద్వారా వారి భవిష్యత్ విద్యా, వృత్తిపరమైన ప్రయాణాలకు వాలంటీర్ సేవా గంటలుగా అధికారికంగా గుర్తించబడతాయి. నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ వాలంటీర్ల సేవలను అభినందించారు. నాట్స్ చికాగో బృందం చేసిన కృషిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల కొనియాడారు. చికాగో చాప్టర్ సమన్వయకర్తలు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాల, చాప్టర్ సభ్యులు పండు చెంగళశెట్టి, మనోహర్ పాములపాటి, గోపీ, వరుణ్ గడ్డం, నాగరాజ్ మేడా, నామదేవ్ గాంధీ, చైతన్య, గణేష్ మాగుంట, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ బొప్పన, మూర్తి కొప్పాక, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వీర తక్కెళ్లపాటి, మాజీ బోర్డ్ సభ్యుడు శ్రీనివాస్ పిడికిటి, మాజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్.కే. బాలినేని, హరీష్ జమ్ముల తదితరులు సహకరించారు.

