జీవితంలో ఒత్తిడి సమన్వయంపై టాంపాలో నాట్స్ సదస్సు

🕑 Published: July 22, 2026 at 05:22 PM CST

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) టాంపా బే ఆద్వర్యంలో ఒత్తిడిని సమన్వయించే సలహాలు-సూచనల సదస్సు ఏర్పాటు చేశారు. చేంజ్ సంస్థ వ్యవస్థాపకుడు కె.గోపాలన్ ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా పాల్గొని ఒత్తిడిని ముందస్తుగా గుర్తించడం, మనపై దాని ప్రభావం, దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను భూతద్దంలో చూడకుండా ఉండటం, వీటిని ఎదుర్కునేందుకు అవసరమైన ఆచరణాత్మక చిట్కాలను ఆయన వివరించారు. ఈ అవకాశం కల్పించిన నాట్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ, డాక్టర్ మల్లికార్జున నంద్యాలలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విక్రం నంధ్యాల సమన్వయపరిచారు. ఒత్తిడిని అధిగమించడానికి ఈ సదస్సు ద్వారా లభించిన సలహాలు ఉపయోగపడతాయని ఆహుతులు అభిప్రాయపడ్డారు.

నాట్స్ కార్యక్రమాల గురించి రాజేశ్ కండ్రు వివరించారు. నాట్స్ టాంపా బే కోర్ టీమ్ సభ్యులు అను కోట, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, సురేష్ బొజ్జా, నవీన్ మేడికొండ, అనిల్ అరెమడ, రవి కాళిదిండి, సంజయ్ కొండ, శిరీష దొడ్డపనేని తదితరులు పాల్గొన్నారు. మురళీకృష్ణ మేడిచెర్ల, కిషోర్ నారె, శ్రవణ్ కుమార్ నిడిగంటిలు సహకరించారు.

📲 Join Our WhatsApp Channel
సెయింట్ లూయిస్‌లో మహావైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగంశుక్రవారం డల్లాస్ పర్యటనకు తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలుDay5-HTSL: వేల మంది భక్తుల సమక్షంలో సహస్ర కమలార్చనDay4-HTSL: శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చనఆగష్టు 1న సిలికానాంధ్ర రజతోత్సవం. మూడు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లు.ఒకే టొర్నీలో మూడు పతకాలు..అట్లాంటా తెలుగు బాలిక ప్రతిభఅరుణ-చండీ-రాజశ్యామల హోమాలతో మూడో రోజు ఆధ్యాత్మిక వైభవంరెండో రోజు వైభవంగా కొనసాగిన శతచండీ సహిత రుద్రయాగంసెయింట్‌లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగంBaltimore Set to Host ATA's 19th Conventionవైవిధ్యభరితంగా ఆటా 19వ మహాసభలున్యూజెర్సీలో వినుకొండ యువతి మక్కెన ప్రసన్న మృతిన్యూజెర్సీలో రాయలసీమ ప్రవాసుల సమావేశంఅమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగంవైభవంగా న్యూజెర్సీ మోన్రో టౌన్‌షిప్ సాయిబాలాజీ ఆలయ భూమిపూజమనస్సున్న మా"రాజు" వై.ఎస్ - డల్లాస్‌లో ఘనంగా జయంతి వేడుకశంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్ఎన్నారై తెదేపా జాతీయ అధ్యక్షుడిగా పిల్ రాజా25న ఫ్రిస్కోలో కీరవాణి సంగీత విభావరి
No Previous Next Article