Day4-HTSL: శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చన

🕑 Published: July 18, 2026 at 10:10 AM CST

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో జరుగుతున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం నాలుగో రోజు అత్యంత వైభవంగా జరిగింది. గోమాత పూజ, మహన్యాస పారాయణం, రుద్రహోమం, సుదర్శనహోమం, చండీ పారాయణ, చండీ హోమం, పవిత్రమైన శక్తివంతమైన ప్రత్యంగిరా హోమం నిర్వహించారు.

భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సామూహిక సహస్ర కుంకుమార్చన ప్రతిష్ఠాత్మకంగా జరిగింది. మహిళలు ఎరుపు రంగు చీరలు ధరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఆలయ కమిటీ అందజేసిన పూజా సామాగ్రితో కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు రుద్రాక్షను కూడా ప్రసాదంగా అందజేశారు. శ్రీచక్రం అద్భుతమైన అలంకరణతో ప్రాంగణమంతా దివ్యత చోటుచేసుకుంది. నవదుర్గాదేవి పూజ చేసి ఋత్విక్కులు మరియు హిందూ టెంపుల్ కలిసి ఇంత భారీ సంఖ్యలో అద్భుతంగా ఉత్తర అమెరికాలో తొలిసారిగా సామూహిక సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఫుడ్ కమిటీ అధ్యక్షురాలు పల్లవి సూరపనేని, రాజేష్ ఏవూరి, సతీష్ లంక నేతృత్వంలోని కమిటీ సభ్యులు 4000 మందికి ప్రసాదాలు తయారు చేశారు. ఆదివారంతో ముగియనున్న ఈ వేడుకల్లో ప్రవాస భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనవల్సిందిగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్, ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి పుట్టగుంట మురళీ, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బైరపునేని సురేంద్రనాథ్, మీడియా విభాగ సమన్వయకర్త రాజా సూరపనేని తదితరులు కోరారు.

📲 Join Our WhatsApp Channel
ఆగష్టు 1న సిలికానాంధ్ర రజతోత్సవం. మూడు గిన్నీస్ రికార్డు లక్ష్యంగా ఏర్పాట్లు.ఒకే టొర్నీలో మూడు పతకాలు..అట్లాంటా తెలుగు బాలిక ప్రతిభఅరుణ-చండీ-రాజశ్యామల హోమాలతో మూడో రోజు ఆధ్యాత్మిక వైభవంరెండో రోజు వైభవంగా కొనసాగిన శతచండీ సహిత రుద్రయాగంసెయింట్‌లూయిస్‌లో వైభవంగా ప్రారంభమైన శతచండీ సహిత రుద్రయాగంBaltimore Set to Host ATA's 19th Conventionవైవిధ్యభరితంగా ఆటా 19వ మహాసభలున్యూజెర్సీలో వినుకొండ యువతి మక్కెన ప్రసన్న మృతిన్యూజెర్సీలో రాయలసీమ ప్రవాసుల సమావేశంఅమెరికాలో తొలిసారిగా నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగంవైభవంగా న్యూజెర్సీ మోన్రో టౌన్‌షిప్ సాయిబాలాజీ ఆలయ భూమిపూజమనస్సున్న మా"రాజు" వై.ఎస్ - డల్లాస్‌లో ఘనంగా జయంతి వేడుకశంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్ఎన్నారై తెదేపా జాతీయ అధ్యక్షుడిగా పిల్ రాజా25న ఫ్రిస్కోలో కీరవాణి సంగీత విభావరిఎర్రబెల్లికి ఆటా సన్మానంYSR Jayanthi Celebrations in Dallas On July 11thశనివారం నుండి విజయవాడలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలుఒర్లాండోలో ఉత్సాహభరితంగా ఆటా సాంస్కృతిక వేడుకలుఆస్ట్రేలియా దేశ జూనియర్ స్క్వాష్ జట్టులో తెలుగు యువకుడికి చోటు
No Previous Next Article