🕑 Published: August 17, 2026 at 08:17 AM CST
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్ మరోసారి నియమితులైన సందర్భంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ రామ్ మాధవ్‌తో గత కొన్ని సంవత్సరాలుగా తనకు సన్నిహిత అనుబంధం ఉందని ఆయన సహకారంతో సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తితో కలిసి 2015లో Singapore Welcomes Modi కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు గుర్తు చేసుకున్నారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆవిర్భావం నుండి సంస్థ నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు రామ్ మాధవ్ స్వయంగా హాజరై తమ ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించారని రత్నకుమార్ గుర్తు చేసుకున్నారు. రామ్ మాధవ్ నాయకత్వం, అనుభవం భారతీయ జనతా పార్టీకి, దేశానికి మరింతగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
