🕑 Published: August 17, 2026 at 04:01 PM CST
భాజపా నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులతో పాటు వివిధ కీలక పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాలను విడుదల చేసింది. భాజపా జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (ఆంధ్రప్రదేశ్), మాజీ సీఎం వసుంధర రాజే సింధియా(రాజస్థాన్)తో పాటు తీరథ్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), రామ్ మాధవ్ (దిల్లీ), బైజయంత్ జయ్ పాండా (ఒడిశా), రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషీ (గుజరాత్), డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ (మహారాష్ట్ర), సర్దార్ మన్‌ప్రీత్ సింగ్‌బాదల్ (పంజాబ్), లాల్ సింగ్ ఆర్య (మధ్యప్రదేశ్), ప్రొఫెసర్ ఎం.నాగరాజ (కర్ణాటక), ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ (ఉత్తర్‌ప్రదేశ్), డాక్టర్ మధుచంద్ర కర్ (పశ్చిమబెంగాల్) చోటు దక్కించుకున్నారు. వీరంతా భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సారథ్యంలో పనిచేయనున్నారు. అలాగే, కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా నియమితులై పార్టీలోని కీలకమైన సంస్థాగత బాధ్యతల్లోకి తిరిగి వచ్చారు.
భాజపా కొత్త టీమ్ ఇదే..
పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత): బీఎల్ సంతోష్ (దిల్లీ)
జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు: శివ్‌ప్రకాశ్ (ముంబయి), సౌదన్ సింగ్ (చండీగఢ్)
జాతీయ ప్రధాన కార్యదర్శులు: వినోద్ తావ్డే (మహారాష్ట్ర), సునీల్ బన్సాల్ (దిల్లీ), బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర), స్మృతి ఇరానీ (ఉత్తర్‌ప్రదేశ్), డా.సతీష్ పూనియా (రాజస్థాన్), గజేంద్ర పటేల్ (మధ్యప్రదేశ్), హరీష్ ద్వివేది (ఉత్తర్‌ప్రదేశ్), సంజయ్ భాటియా (హరియాణా)
జాతీయ కార్యదర్శులు: కవిత పటిదార్ (మధ్యప్రదేశ్), సురేంద్రన్ (కేరళం), డా.భోలా సింగ్ (ఉత్తర్‌ప్రదేశ్), డా ప్రదీప్ వర్మ (ఝార్ఖండ్), జగదీశ్ ఈశ్వర్‌భాయ్ పటేల్ (గుజరాత్), డా సందీప్ పాఠక్ (దిల్లీ), ఫాంగ్నాన్ కొన్యాక్ (నాగాలాండ్), సంగీత యాదవ్ (ఉత్తర్‌ప్రదేశ్), అనిల్ ఆంటోనీ (కేరళం), డా ఎం.వెంకటేశన్ (తమిళనాడు), మనోజ్ తిగ్గ (పశ్చిమబెంగాల్), సిద్ధార్థ్ శంభు (బిహార్), డా.స్వదేశ్ సింగ్ (దిల్లీ), మృగంకా దేవ్ బర్మన్ (అస్సాం), రోహన్ గుప్తా (గుజరాత్), జయప్రకాశ్ (దిల్లీ)
జాతీయ కోశాధికారి: పీయూష్ గోయల్ (మహారాష్ట్ర)
జాతీయ సంయుక్త కోశాధికారి: రాజేశ్ మంగల్ (రాజస్థాన్)
సెంట్రల్ ఆఫీస్ ఇన్‌ఛార్జి: తరుణ్ చుగ్ (పంజాబ్)
సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శి : మహేంద్ర పాండే (ఉత్తరాఖండ్)
నార్త్ ఈస్ట్ కోఆర్డినేటర్- డా సంబిత్ పాత్రా (ఒడిశా)
నార్త్ ఈస్ట్ జాయింట్ కోఆర్డినేటర్ - రాజీవ్ బబ్బర్ (దిల్లీ)
ఆల్ సెల్స్ కోఆర్డినేటర్: విష్ణుదత్ శర్మ (మధ్యప్రదేశ్)
ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్స్: రితురాజ్ సిన్హా (బిహార్), విష్ణువర్దన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్)
మోర్చా ప్రెసిడెంట్స్:
యువమోర్చా: డా.హేమాంగ్ జోషి (గుజరాత్)
మహిళా మోర్చా : రూప్ కుమారి చౌధరి (ఛత్తీస్‌గఢ్)
ఓబీసీ మోర్చా : అమర్‌పాల్ మౌర్య (ఉత్తర్‌ప్రదేశ్)
కిసాన్ మోర్చా - బన్సిలాల్ గుర్జర్ (మధ్యప్రదేశ్)
ఎస్సీ మోర్చా : శివేష్ కుమార్ రామ్ (బిహార్)
ఎస్టీ మోర్చా : డా మన్నాలాల్ రావత్ (రాజస్థాన్)
మైనార్టీ మోర్చా - కున్వర్ బాసిత్ అలీ (ఉత్తర్‌ప్రదేశ్)
మీడియా కన్వీనర్: అనిల్ బలూని (ఉత్తరాఖండ్)
మీడియా కో-కన్వీనర్లు: ఆశీష్ ఉషా అగర్వాల్ (మధ్యప్రదేశ్), ప్రదీప్ భండారి (దిల్లీ), సిద్ధార్థ్ యాదవ్ (దిల్లీ)
సోషల్ మీడియా కన్వీనర్: దీపక్ మస్కే (ఛత్తీస్‌గఢ్)
సోషల్ మీడియా కో-కన్వీనర్లు: ప్రీతి గాంధీ (మహారాష్ట్ర), శివానంద్ ద్వివేది (దిల్లీ), అలోక్ భట్ (ఉత్తరాఖండ్), అరుణ్ యాదవ్ (హరియాణా)
