🕑 Published: October 06, 2026 at 09:39 AM CST
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(TANTEX) శనివారం నాడు నిర్వహించిన 5K వాక్/రన్ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఆరోగ్య అవగాహనతో పాటు కమ్యూనిటీ ఐక్యత, సేవా స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 150 మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, BMI కొలతలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. దక్షిణాసియా ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన కల్పించేందుకు DFW ప్రాంతంలో పనిచేస్తున్న DilSe Program సంస్థ ఆధ్వర్యంలో CPR శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న వారికి అల్పాహారాన్ని అందించారు.
కమ్యూనిటీ సేవలో భాగంగా Frisco Family Services సంస్థ టాంటెక్స్ $1,000 విరాళాన్ని అందించింది. ఫ్రిస్కోలో 30 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న ఈ లాభాపేక్షలేని సంస్థ నిరాశ్రయులకు, నిరుపేదలకు చేయూతనందిస్తోంది. టాంటెక్స్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి స్పాస్నర్లకు, నిర్వాహకులకు, వాలంటీర్లకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు.




