హవాయి విశ్వవిద్యాలయ కీలక పదవిలో డా. దారా సురేంద్ర

🕑 Published: September 25, 2026 at 10:55 AM CST

హవాయి విశ్వవిద్యాలయం–మానోవాలోని CTAHR (College of Tropical Agriculture and Human Resilience, University of Hawaii-Manoa) విభాగానికి డాక్టర్ సురేంద్ర దారా సెప్టెంబర్ 1 నుంచి అసోసియేట్ డీన్‌గా బాధ్యతలు చేపట్టారు. తన నూతన నాయకత్వ బాధ్యతల్లో భాగంగా, హవాయిలోని ఆహార ఉత్పత్తిదారులు, సమాజాలు, కుటుంబాలకు ఆచరణాత్మకమైన, ప్రభావవంతమైన శాస్త్రాధారిత విస్తరణ విద్య, పరిశోధనలను అందించే వ్యూహాలకు డాక్టర్ దారా దిశానిర్దేశం చేస్తారు.

కీటకశాస్త్రం, సమగ్ర సస్యరక్షణ నిర్వహణ, సూక్ష్మజీవ ఆధారిత నియంత్రణ రంగాల్లో దశాబ్దాల అనుభవాన్ని డాక్టర్ దారా ఈ పదవికి తీసుకువస్తున్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ వ్యవస్థల్లో పంటల ఆరోగ్యం, జీవ ఉద్దీపకాలు, నీటిపారుదల, పోషక నిర్వహణ వంటి అంశాలపై ఆయన విస్తృతంగా పనిచేశారు. నాలుగు వందలకు పైగా శాస్త్రీయ వ్యాసాలు, పుస్తక అధ్యాయాలను రచించి వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవలకు విశేషంగా తోడ్పడ్డారు. సమగ్ర సస్యరక్షణ నిర్వహణ, సూక్ష్మజీవ ఆధారిత నియంత్రణ రంగాలకు అందించిన సేవలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆయన, పరిశోధన మరియు విస్తరణ సేవల్లో సాధించిన విజయాలకు అనేక పురస్కారాలను అందుకున్నారు. ఈ పదవిని చేపట్టడానికి పూర్వం డాక్టర్ దారా CTAHR హవాయిలోని మావీ కౌంటీ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను పర్యవేక్షించారు. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నార్త్ విలామెట్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ డైరెక్టర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కోఆపరేటివ్ ఎక్స్‌టెన్షన్ లో కీటకశాస్త్ర నిపుణుడిగా సేవలందించారు.

📲 Join Our WhatsApp Channel
చంద్రబాబుతో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు డా.గురురాజా భేటీ450మంది పేదలకు భోజనం అందించిన నెబ్రాస్కా తెలుగు సమితిఅక్టోబర్ 1న కవిరాజు త్రిపురనేని రామస్వామి చైతన్య యాత్రసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంజర్మనీలో వేడుకగా తెలుగు సంబరంఫిలడెల్ఫియాలో ఉత్సాహంగా సాగిన తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ఉల్లాసంగా నెబ్రాస్కా తెలుగు సమితి వనభోజనాలుబే-ఏరియాలో వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవంన్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీఫ్రిస్కోలో టాంటెక్స్ ఉచిత వైద్య శిబిరంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్ కళాకారుల ప్రదర్శనఉల్లాసంగా సాగిన తానా వేసవి చదరంగ పోటీఅమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సుఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు
❮ No Previous Next Article ❯