సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం

🕑 Published: October 03, 2026 at 07:17 PM CST

రియాద్‌లో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (SATA-సాటా) ఆధ్వర్యంలో సీజన్‌-5 తెలుగు భాషా దినోత్సవం, వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత రాయబారి విపుల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత ఐదేళ్లుగా తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణతో పాటు సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ ‘సాటా’ సాగిస్తున్న ప్రయాణాన్ని నిర్వాహకులు వివరించారు. 300కి పైగా వ్యక్తులు, కుటుంబాలకు వివిధ సందర్భాల్లో సహాయం అందించినట్లు తెలిపారు. అత్యవసర వైద్య పరిస్థితులు, చిన్నారుల చికిత్స, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహకారం అందించడం, అవసరమైనప్పుడు సమాజం నుంచి సహాయాన్ని సమీకరించడం వంటి కార్యక్రమాల ద్వారా సాటా మానవతా సేవలను కొనసాగిస్తోందన్నారు. దీనికి కోర్ కమిటీ, కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు, దాతలు, స్పాన్సర్లు, తెలుగు సమాజ సభ్యుల సహకారం కీలకంగా నిలుస్తోందని చెప్పారు.

సాటా కేవలం సాంస్కృతిక వేడుకలు నిర్వహించే సంస్థ మాత్రమే కాదని.. సౌదీ అరేబియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు అవసరమైన సమయంలో తోడుగా నిలిచే సామాజిక వేదిక అని చెప్పారు. గత ఐదేళ్లుగా సాటా వ్యవస్థాపకులు ఆనందరాజు గుండుబోగుల, రంజిత్‌ చిత్తులూరి, ముజమ్మిల్‌ షేక్‌ చేస్తున్న కృషిని భారత రాయబారి విపుల్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. సాటా వ్యవస్థాపకుల దూరదృష్టి, అంకితభావం, సేవా స్ఫూర్తితో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలకు వేదికగా ఎదిగిందని కొనియాడారు.

సామాజిక సేవతో పాటు తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, కళలు, పండుగలు, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో సాటా నిరంతరం కృషి చేస్తోంది. సీజన్-5 వేడుకల్లో గాయకులు రఘు కుంచె, హారిక నారాయణ సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను చాటారు. తెలుగు భాషా దినోత్సవంతో పాటు సౌదీ అరేబియా జాతీయ దినోత్సవ స్ఫూర్తిని కూడా వేడుకల్లో ప్రతిబింబించారు. ఆతిథ్య దేశమైన సౌదీ అరేబియా పట్ల గౌరవం, భారతీయ సంస్కృతి పట్ల గర్వం, విభిన్న సంస్కృతుల మధ్య పరస్పర గౌరవం అనే సందేశాలను ఈ కార్యక్రమం చాటిచెప్పిందని నిర్వాహకులు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
Telangana Development Forum TDF Batukamma On Oct 10th In New Jerseyబోస్టన్ ప్రవాసులను అలరించిన సహస్ర భరతనాట్య అరంగేట్రంTexas/USA: ఫ్రిస్కో పార్కును దత్తత తీసుకున్న నాట్స్తానా ప్రపంచసాహిత్యవేదిక 96వ సమావేశం విజయవంతంOhio/USA: క్లీవ్‌ల్యాండ్‌లో తానా 5కె వాక్Dallas/USA - TANEX 5K WALK and RUN ON OCT 3rdహవాయి విశ్వవిద్యాలయ కీలక పదవిలో డా. దారా సురేంద్రచంద్రబాబుతో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు డా.గురురాజా భేటీ450మంది పేదలకు భోజనం అందించిన నెబ్రాస్కా తెలుగు సమితిఅక్టోబర్ 1న కవిరాజు త్రిపురనేని రామస్వామి చైతన్య యాత్రసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంజర్మనీలో వేడుకగా తెలుగు సంబరంఫిలడెల్ఫియాలో ఉత్సాహంగా సాగిన తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ఉల్లాసంగా నెబ్రాస్కా తెలుగు సమితి వనభోజనాలుబే-ఏరియాలో వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవంన్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలు
❮ Previous Article Next Article ❯