🕑 Published: September 28, 2026 at 11:34 AM CST
తానా క్లీవ్‌ల్యాండ్ ఆధ్వర్యంలో 5కే రన్/వాక్ కార్యక్రమం ఆరోరాలోని సన్నీ లేక్ పార్క్‌లో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రవాస తెలుగు కుటుంబాలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పంగులూరి రామారావు సమన్వయంలో ఆరోగ్యం, సేవాభావం, సామాజిక ఐక్యతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. యోగా కార్యక్రమంతో ప్రారంభమై, 5కే రన్/వాక్, చిన్నారుల వినోద కార్యక్రమాలతో కొనసాగింది. తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ చందనం, ఓహాయో వ్యాలీ టీమ్ స్క్వేర్ చైర్ వేణు తలశిల అతిథులుగా హాజరయ్యారు.
తానా క్లీవ్‌ల్యాండ్ బృందం లక్ష్మి యార్లగడ్డ, సుహాసిని అడ్డగడ, దుర్గా ప్రసాద్ చెట్టిభక్తుని, నరేష్ బొడ్డు, సతీష్ దంతులారి, ప్రియాంక యడ్లపల్లిలు కీలకపాత్ర పోషించారు. మహేష్ అడ్డగడ, రాధ తాళ్లూరి, యువరాజ్ పంగులూరి, తాజుల్ షేక్, రామారావు అప్పన, సరిత చిన్నం, రాజా అబ్బెన్నగారి, అభయ్ గైక్వాడ్, ఆర్.కే. వెలగా, రాజ్ తీగల, సంగీత తీగల, సంతోష్ కేసిరెడ్డి, సతీష్ కడియాల, శ్రీకాంత్ రెడ్డి, రమణ ఈర్ల, అంజలి పంగులూరి, చెష్విక్ అడ్డగడ, శంకర్ తదితర వాలంటీర్లు సహకరించారు. యార్లగడ్డ, వెలగా, మేదరమెట్ల కుటుంబలు చేయూతనందించాయి. నీయోటా, సప్తస్వర అకాడమీ, శ్రీ మయూరి డాన్స్ అకాడమీ, నర్తనం డాన్స్ అకాడమీ, సాన్స్ డాన్స్ వైబ్స్, మిరాకిల్ మైండ్ భాగస్వామ్యం వహించాయి.




