🕑 Published: October 03, 2026 at 07:28 PM CST
గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సిలికానాంధ్ర-రవిప్రకాశ్ సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కీలక మైలురాయిని సాధించింది. 2026 సెప్టెంబర్ నెలలో ఈ ఆసుపత్రి ద్వారా 5328 మంది రోగులకు విజయవంతంగా వైద్య సేవలు అందించినట్లు సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ఒక నెలలో తొలిసారిగా 5,000 మందికి పైగా రోగులకు సేవలందించడం సంజీవని ఆసుపత్రి ప్రస్థానంలో ముఖ్యమైన ఘట్టంగా ఆసుపత్రి పేర్కొంది. సంజీవని వైద్య బృందం అంకితభావం, కృషి, సమాజం తమపై ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని ఆసుపత్రి తెలిపింది. పెద్ద సంఖ్యలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం ద్వారా వేలాది కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించగలుగుతున్నామని పేర్కొంది.
