🕑 Published: October 04, 2026 at 06:19 PM CST
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న శ్రీ విశ్వేశ్వరస్వామి, శ్రీ పార్వతి సమేత నాగలింగేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణకు తితిదే రూ.6కోట్ల నిధులను మంజూరు చేసింది. గత డిసెంబరులో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన తితిదే బోర్డు శ్రీవాణి ట్రస్ట్ నుండి ఈ నిధులను కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు నుండి సదాశివరావు చెక్కును అందుకున్నారు. కాకతీయుల కాలం నాటి నుండి విశేష ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాల పునరుద్ధరణకు తన వంతు చేయూతనివ్వడం, శివ కరుణగా, జన్మ సాఫల్యంగా భావిస్తున్నట్లు సదాశివరావు TNIకు తెలిపారు.


