సెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరం

🕑 Published: September 22, 2026 at 09:08 AM CST

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మిస్సోరీ విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్‌లో క్రీడా సంబరాలను నిర్వహించారు. వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు ఏర్పాటు చేశారు. 34 జట్లులో 275 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలు, రన్నరప్‌లుగా నిలిచిన జట్లకు నాట్స్ ట్రోఫీలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. మిస్సోరీ రాష్ట్రంతో పాటు విస్కాన్సిన్, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, కన్సాస్ రాష్ట్రాల నుంచి తెలుగు జట్లు తరలివచ్చి ఈ పోటీల్లో సత్తా చాటారు. నాట్స్ సలహా మండలి సభ్యుడు డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి అభినందించారు.

రెండు నెలలకు పైగా సమయాన్ని వెచ్చించి క్రీడా సంబరాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన నాట్స్ నార్త్ సెంట్రల్ జోన్ ఉపాధ్యక్షుడు సందీప్ కొల్లిపర, మిస్సోరి చాప్టర్ సభ్యుడు మధు దడ్డాల సేవలను కార్యవర్గం అభినందించింది. వీర తక్కెళ్ళపాటి, మురళి బండారుపల్లి, రాకేష్ రెడ్డి మారుపాటి, అన్వేష్ చాపరాల, చైతన్య పుచ్చకాయల, సునీల్ స్వర్ణ, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, హరీష్ గోగినేని, మధు పాటిబండ్ల, విజయ్ కుమార్ పెనుమత్సలు పోటీలు విజయవంతంలో కీలకపాత్ర పోషించారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడలు విజేతలను అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
న్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీఫ్రిస్కోలో టాంటెక్స్ ఉచిత వైద్య శిబిరంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్ కళాకారుల ప్రదర్శనఉల్లాసంగా సాగిన తానా వేసవి చదరంగ పోటీఅమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సుఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలుSingapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making EventAustralia: సిడ్నీలో "నిజం గెలిచింది"మెలిస్సాలో "సంకీర్తన" తరగతులువీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీనెబ్రాస్కా తెలుగు సమితి ఆధ్వర్యంలో 5కె వాక్YSR FOUNDATION DALLAS BLOOD DONATION CAMP ON SEP 29th
No Previous Next Article