🕑 Published: September 25, 2026 at 10:47 AM CST
గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ తెదేపా చీఫ్‌గా ఈనెల 9న బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి.గురు రాజా(Global NRI TDP chief Raja) .. శుక్రవారం సీఎం చంద్రబాబు(Chandrababu)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు (ఎన్‌ఆర్‌ఐలు) ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం తదితర అంశాలపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి జూమ్ సమావేశం నిర్వహించాలని రాజా విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించి, సమావేశానికి సంబంధించిన షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని సూచించారు. ఇదే జోష్‌తో ముందుకు సాగాలని, పూర్తి సహకారం అందిస్తామని సీఎం చెప్పినట్టు రాజా తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి రాజా మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం మరింత బాధ్యతతో పనిచేసేందుకు తనకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీని మరింత బలోపేతం చేస్తూ, ప్రవాసాంధ్రుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
