మలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలు

🕑 Published: October 18, 2026 at 12:14 PM CST

కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 13వ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, జానపద కళలతో అంగరంగ వైభవంగా మలేషియా వేదికగా ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత కాన్సులేట్ అధికారి రాజేష్ హెచ్. మణియిల్ పాల్గొన్నారు. ప్రముఖ జానపద నృత్య కళాకారిణి జనుల్యూరి, ప్రముఖ జానపద గేయ రచయిత-గాయకుడు దిలీప్ దేవ్‌గన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరుణ్ కొలుగూరిలు పాల్గొని తమ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు. వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ తెలంగాణ వంటకాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సందర్శకులు తెలంగాణ రుచులను ఆస్వాదించేలా ప్రత్యేక ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.

మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సైదం తిరుపతి అతిథులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యక్షుడు చిరుత చిట్టిబాబు, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి దండెబోయిన, ప్రధాన కార్యదర్శి సందీప్ గౌడ్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ రావు నడిపెల్లి, కోశాధికారి సందీప్ కుమార్ లగిశెట్టి, సంయుక్త కోశాధికారి సుందర్ రెడ్డి మోర్తాల, యూత్ అధ్యక్షులు సంతోష్ దాసరాజు, యూత్ ఉపాధ్యక్షుడు పోలాది శివ తేజ, అడ్వైజరీ సభ్యులు మన్సూర్, సుధీర్ మడుగురి, గోన వేణు గోపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మారుతి, రమేష్, రాములు, పూర్ణచందర్ రెడ్డి, సుప్రియ, జ్యోతి, అనిల్ కుమార్, మహేందర్ రెడ్డి, మధు, రంజిత్ కుమార్, శేషి కుమార్, జీవన్ రెడ్డి, హరిప్రసాద్, రఘుపాల్ రెడ్డి, వినోద్ కుమార్, మహేష్, శ్రీనివాస్, నరేష్ కుమార్, రంజిత్, వెంకట్, రాజేష్, దామోదర్, దీపిక, మౌనిక తదితరులు కార్యక్రమం విజయవంతానికి తోడ్పడ్డారు.

తెలంగాణ పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలను మలేషియాలో కొనసాగిస్తూ, భవిష్యత్ తరాలకు తెలంగాణ వారసత్వాన్ని పరిచయం చేయడమే తమ లక్ష్యమని ంYటా ప్రతినిధులు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
మలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరిహ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలుమల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళం
❮ No Previous Next Article ❯