Singapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

🕑 Published: October 19, 2026 at 11:45 AM CST

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)/TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక Our Tampinesలో శనివారం నాడు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా సాగాయి. బతుకమ్మ సాంప్రదాయ ఆటపాటలతో చిన్న పెద్ద హుషారుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను క్లుప్తంగా వివరిస్తూ, సింగపూర్‌లో బతుకమ్మను జరుపుకుంటూ తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటుతున్న తెలంగాణ, తెలుగు ప్రజలందరికీ దసారా-బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ ఎస్.పి.ఎస్. ఒబెరాయ్, భారత హైకమీషన్ కార్యాలయ అధికారి మృత్యుంజయ్ శ్రీకామతన్‌లను సొసైటీ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి, కమిటీ సభ్యులు సత్కరించారు. సంబరాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహాయం అందించిన దాతలకు టీసీఎస్‌ఎస్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

వివిధ రూపాలలో 150కి పైగా బతుకమ్మలను మహిళలు తీసుకువచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 10 బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. వేడుకల్లో పాల్గొనే అతిథుల సౌకర్యార్థం బూన్ లే, జూరాంగ్ ఈస్ట్, బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్ ,పుంగ్గోల్, జలాన్ పపన్, పెంజురు ప్రాంతాల నుండి బస్సులను నామమాత్రపు రుసుముతో ఏర్పాటు చేశారు. సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం, సుకేందర్ నీలం, సొసైటీ మహిళా విభాగ సభ్యులు దీపా భాస్కర్ గుప్తా నల్ల; ఉమా రాణి బొందుగుల; దీప్తి ఎర్రమరెడ్డి; అనిత బసిక; పద్మజ జూలూరి; సౌజన్య మాదారపు; సౌజన్య నంగునూరి; కళ్యాణి నడికట్ల; నిఖిత కాల్వ; సుష్మా ఆవుల; హరిత విజాపూర్;సృజన వెంగళ;సుధారాణి పెసరు;హరిత పులిగిల్ల; హర్షిణి మామిడాల;కీర్తి సుధ కళ్ళెం; దివ్య నీలం సంబరాల ఏర్పాట్లను సమన్వయపరిచరు.

📲 Join Our WhatsApp Channel
Austria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలుదుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మమలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలుమలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరిహ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తి
❮ No Previous Next Article ❯