సందడిగా TPAD బతుకమ్మ సంబరం

🕑 Published: October 19, 2026 at 04:43 PM CST

తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(TPAD) ఆధ్వర్యంలో శనివారం నాడు వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుకలను టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలోని కొమెరికా సెంటర్‌లో ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన బతుకమ్మ ఆటపాటలు ప్రాంగణానికి తెలంగాణ సంప్రదాయ పరిమళాలతో కొత్త వన్నెలద్దాయి. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినీ నటుడు నవీన్ పోలిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని తన ప్రదర్శనతో అలరించారు. గాయకుడు కృష్ణ చైతన్య నేతృత్వంలోని ‘ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్’ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. టి-ప్యాడ్ అధ్యక్షురాలు లక్ష్మీ పోరెడ్డి, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డిల నేతృత్వంలో 20 కమిటీలకు చెందిన వాలంటీర్లు గడిచిన మూడు నెలలుగా ఈ కార్యక్రమం కోసం కృషి చేశారు.

📲 Join Our WhatsApp Channel
Singapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుAustria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలుదుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మమలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలుమలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరిహ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్
❮ No Previous Next Article ❯