ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరా

🕑 Published: October 22, 2026 at 11:37 AM CST

ఒరెగాన్ స్టేట్ పోర్ట్‌లాండ్ నగరంలో ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ (OTA) ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. R.A Brown Middle Schoolలో జరిగిన ఈ వేడుకలను OTA ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకి పోర్ట్‌లాండ్‌ మెట్రో సిటీస్ నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ వేడుకకి మహిళలు, చిన్నారులు తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగు రంగుల బతుకమ్మలతో వచ్చి, ఆట పాటలతో సందడి చేశారు. బతుకమ్మ నిమజ్జనం అనతంరం ప్రసాద వితరణ చేశారు. అలాగే విజయదశమి పర్వదినం పురస్కరించుకుని జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ బలాయ్ చేసుకున్నారు. కాగా, బతుకమ్మ రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేసింది.

ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల ఓటీఏ టీం తరుపున బతుకమ్మ దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పండుగని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు, సహకారం అందించిన స్పాన్సర్‌కి శ్రీని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న పోర్ట్‌లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, స‌హ‌క‌రించిన‌ మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఓటీఏ టీమ్ తరుఫున అభినందనలు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
బోస్టన్‌లో సందడిగా దసరా-దీపావళి వేడుకలుCanada..ఘనంగా తాకా బతుకమ్మ సంబరాలుహాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుసందడిగా TPAD బతుకమ్మ సంబరంSingapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుAustria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలుదుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మమలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలుమలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరిహ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ
❮ Previous Article Next Article ❯