🕑 Published: October 18, 2026 at 04:45 PM CST
ఆస్ట్రియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వియన్నాలో శనివారం నాడు దసరా-బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షురాలు శ్రీలత కోమటిరెడ్డి సభికులను ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మహిళలు బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేయగా, చిన్నారులు, యువత సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ తెలుగు వంటకాలతో ఏర్పాటు చేసిన సామూహిక భోజనం, సంగీత కార్యక్రమాలు, లక్కీ డ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమ విజయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, సమిష్ఠిగా కృషి చేశారు.
