తితిదేకు 14టన్నుల కూరగాయలు విరాళం ఇచ్చిన కొల్లావారిపాలెం గ్రామస్థులు
🕑 Published: November 25, 2026 at 12:10 PM CST
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా పర్చూరు మండలం కొల్లావారిపాలెంకు చెందిన కొల్లా చంద్రం, హరిబాబు, అశోక్‌బాబులు తితిదేకు 14టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. వీటిని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రం వద్ద తితిదే జేఈవో వెంకయ్య చౌదరి అందుకున్నారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు.