అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలు

🕑 Published: June 16, 2026 at 10:28 AM CST

అమెరికా తెలుగు సంఘం(ఆటా) మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో జులై 31 నుండి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న 19వ మహాసభల్లో భాగంగా వర్జీనియా, చికాగో, డెలావేర్ వ్యాలీ, న్యూజెర్సీ, ఆర్లాండో, ఆస్టిన్, ఫీనిక్స్, అట్లాంటా, డల్లాస్, రాలీతో పాటు అమెరికాలోని పలు నగరాలలో “ఝుమ్మంది నాదం” (గాన పోటీలు) మరియు “సయ్యంది పాదం” (నృత్య పోటీలు) కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది యువతను తెలుగు భాష, సంగీతం, నృత్యం, సంస్కృతి వైపు ఆకర్షించే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చల్లా జయంత్ తెలిపారు. ప్రవాస రెండవ, మూడవ తరం యువతకు తమ మూలాలను పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అని అన్నారు.

ఈ పోటీల ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సృజనాత్మకత, జట్టు భావన, సామాజిక బాధ్యత వంటివి యువతలో పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమాల విజయానికి కృషి చేసిన పోటీదారులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవకులు, న్యాయనిర్ణేతలు, సాంస్కృతిక సమన్వయకర్తలు, ప్రాంతీయ నాయకత్వ బృందాలను ఆయన అభినందించారు. ఈ పోటీల ద్వారా తుదిపోటీకి ఎంపికైన కళాకారులు జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభల ప్రధాన వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. కన్వెన్షన్ వెబ్‌సైట్: www.ATAconference.org

📲 Join Our WhatsApp Channel
ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడుAPTS ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ శిక్షణఎన్నారైలకు తితిదే గుడ్ న్యూస్...ఇక 90రోజులుమలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధంస్కాట్‌ల్యాండ్‌లో ఘనంగా మినీ మహానాడుఐ ఫౌండెషన్ ఆఫ్ అమెరికాకు నాట్స్ భారీ విరాళం
Previous Article Next Article