🕑 Published: June 21, 2026 at 12:00 PM CST
ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం అభినందన సభ డెట్రాయిట్ లోని ఫర్మింగ్టన్ హిల్స్ మేనర్ లో శుక్రవారం నాడు వైభవంగా జరిగింది. ఎన్నారై టిడిపి డెట్రాయిట్, మిచిగన్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. అటు సంక్షేమంతోపాటు, ఇటు పెట్టుబడులకోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఎన్నారైలు కూడా పాలుపంచుకోవాలని కోరారు. ఐటీ, టూరిజం, విద్య, వైద్యరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ఎన్నారైలు తమవంతుగా రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడానికి ఎన్నారైలు తోడ్పాటును అందించాలని కోరారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రగతికోసం కృషి చేస్తున్నారని వెల్లడించారు.
గంగాధర్ నాదెళ్ళ, సునీల్ పంట్ర, కిరణ్ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, సురేష్ పుట్టగుంట, వాసు గన్నమనేని, రాంప్రసాద్ చిలుకూరి, సతీష్ వేమన, నరేన్ కొడాలి, బండ్ల హనుమయ్య, జయశేఖర్ తాళ్ళూరి, బిజెపి మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పాతూరి నాగభూషణం, సాయి బొల్లినేని, అనిల్ ఉప్పలపాటి, లక్ష్మీనారాయణ సూరపనేని, రాజా సూరపనేని, శ్రీకాంత్ దొడ్డపనేని తదితరులు పాల్గొన్నారు.
