సిద్ధార్థ ఫార్మసీ కళాశాలతో సెయింట్ మార్టినస్ ఒప్పందం

🕑 Published: June 19, 2026 at 03:10 PM CST

ఆధునిక వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర రోజు రోజుకూ విస్తరిస్తోందని కురసావు(కరేబీయన్) సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ మురళీచంద్ గింజుపల్లి అన్నారు. నగరంలోని కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఫార్మాస్యూటిక్స్‌, బయోటెక్నాలజీ విభాగాల ఆధ్వర్యంలో గురువారం “ఫ్రమ్ ఫార్మసీ టు హెల్త్ కేర్ లీడర్‌షిప్: ది నెక్స్ట్ రివల్యూషన్ ఇన్ మెడిసిన్” అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీచంద్ మాట్లాడుతూ రోగి సంరక్షణ, ఔషధ అభివృద్ధి, క్లినికల్ పరిశోధనలు, ప్రజారోగ్య సేవలు వంటి రంగాల్లో ఫార్మసిస్టులు కీలక నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కేవలం ఔషధ నిపుణులుగానే కాకుండా ఆరోగ్య విధాన రూపకర్తలు, పరిశోధకులు, వైద్య రంగ నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఒకరికొకరు పరిజ్ఞానాన్ని పంచుకునేలా సిద్ధార్థ ఫార్మసీ కళాశాల మరియు సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సునీత, ఫార్మాస్యూటిక్స్ హెచ్‌ఓడీ డాక్టర్ జి. రమణ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
అమరావతిలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభంఏపీ ప్రగతిలో ప్రవాసులది కీలక పాత్ర-గాలి భానుప్రకాష్చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమంవిజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరివనపర్తి జిల్లాలో మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకు భువనేశ్ తోడ్పాటుజర్మనీలో ఘనంగా మినీ మహానాడు
No Previous Next Article