వర్జీనియాలో విజయవంతంగా ఆటా సాహిత్య సభ

Featured Image

అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో వాషింగ్టన్ డి.సి మెట్రో ప్రాంతంలోని సాహిత్యాభిమానుల కోసం ఆటా సాహిత్య సభను నిర్వహించారు. కవులు, రచయితలు, పాఠకులు, మరియు ప్రవాస తెలుగు సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొన్నారు. ప్రముఖ కవి, అవధాని నరాల రామారెడ్డి, రచయిత్రి దివాకర్ల రాజేశ్వరి, మాగులూరి భానుప్రకాష్, ముఖ్య వక్తలుగా పాల్గొని "గురజాడ రచనలు - సామాజిక బాధ్యత", "సినీ ప్రపంచంలో శ్రీ శ్రీ పాట" వంటి అంశాలపై విలక్షణమైన వ్యాఖ్యలు చేశారు. రాజేశ్వరి రచించిన కథాసంపుటి "పగడాల దీవి" పుస్తకాన్ని వేణు నక్షత్రం పరిచయం చేశారు.

ఆటా సాహిత్య విభాగం సభ్యులు భూపతి విహారి నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో కవితలను చదివిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి చంద్ర చెళ్ళపిళ్ళ, ద్వితీయ బహుమతి సౌజన్య గుడిపాటి, తృతీయ బహుమతి సుశీల సత్యవోలులు అందుకున్నారు. సాహిత్య విభాగ కమిటీ ఛైర్మన్ వేణు నక్షత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షుడు భువనేశ్ భూజాలా, కార్యనిర్వాహక సభ్యులు సుధీర్ భండారు, జీనత్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Literary Meet In Virginia

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles