సూర్యాపేటలో జిల్లాలో ఆటా సేవా దినోత్సవం

Featured Image

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆటా బృందాన్ని అభినందించారు. ఆటా చేపడుతున్న సామాజిక సేవలు, ధార్మిక కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు.

ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా గ్రామాల్లో విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆటా సేవ కార్యక్రమాలు అభివృద్ధి కోసమే చేస్తున్నామని చెప్పారు. వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యులు రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Seva Days 2025 In Suryapeta District

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles