సిలికానాంధ్ర ఆధ్వర్యంలో శతక శంఖారావం

Featured Image

ఆగష్టు 8వ తేదీన కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్ ఎరీనాలో నిర్వహించనున్న సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో భాగంగా శతక శంఖారావం పేరిట తొలిసారిగా తెలుగు పద్యాలతో గిన్నీస్ రికార్డు సృష్టించే ప్రయత్నానికి రూపకల్పన చేసినట్లు సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. వేమన శతకం నుండి 9, సుమతీ శతకం నుండి 9 పద్యాలతో 1800మంది ప్రవాస బాలబాలికలు, యువతీయువకులు, పెద్దలు ఈ శంఖారావంలో పాల్గొని గిన్నీస్ రికార్డు సృష్టిస్తారని పేర్కొన్నారు. మార్చి 31లోగా silverjubilee.siliconandhra.org/registration/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

అమెరికా గడ్డపై తెలుగు పద్యాలతో తొలిసారిగా గిన్నీస్ రికార్డు నెలకొల్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గిన్నీస్ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమ పర్యవేక్షకులుగా హాజరవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ వారి పేరిట గిన్నీస్ సంస్థ నుండి సర్టిఫికేట్ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సర్టిఫికేట్ ద్వారా కాలేజీ ప్రవేశాలకు స్వల్ప ప్రాధాన్యత లభిస్తుందని వెల్లడించారు. పద్యాల ఆడియో ఫైల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Tags-SiliconAndhra Sataka Sankharavam In August 2026 As Part Of Silver Jubilee

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles