మలేషియాలో తొలిసారిగా MYTA ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం

Featured Image

మలేషియా తెలంగాణ అసోసియేషన్(MYTA) ఆధ్వర్యంలో మలేషియాలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో ఉద్భవించిన బోనాలు పండుగ, మహాకాళికి అర్పించే భక్తి, శ్రద్ధల సమ్మేళనంగా, పాటలు, డాన్సులు, పల్లకీలు, పోతరాజుల ఆటలతో జరుపబడే ప్రాచీన పండుగ. మలేషియాలో ఈ వేడుకను తెలంగాణ శైలిలో నిర్వహించడం విశేషం.

ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొని బోనం సమర్పించారు. జానపద నృత్యాలు, ఊరేగింపు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బోనాల్ని మలేషియాలో నిర్వహించడం మా సంస్కృతిని కాపాడటమే కాదు..మలేషియన్ సమాజంతో మన సంప్రదాయాలను పంచుకునే అవకాశం కూడానని సంస్థ అధ్యక్షుడూ సైదం తిరుపతి అన్నారు.

Tags-Saginaw Sai Samaj First Anniversary

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles